పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:31 PM
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. స్థానిక నందన గార్డెన్‌లో నియోజకవర్గ పరిధిలోని 820మంది సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) లబ్ధిదారులకు 2 కోట్ల 64 లక్షల 6వేల 9వందల రూపాయల చెక్కులను అందజేశారు.
పెద్దపల్లి టౌన్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. స్థానిక నందన గార్డెన్‌లో నియోజకవర్గ పరిధిలోని 820మంది సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) లబ్ధిదారులకు 2 కోట్ల 64 లక్షల 6వేల 9వందల రూపాయల చెక్కులను అందజేశారు. అలాగే 113 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు కోటి 33 లక్షల 15వేల 428 రూపాయల విలువ గల చెక్కులను శనివారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యసేవలను అందిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పిలునిచ్చారు. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అధునాతన హంగులతో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు ఆధునికీకరణ చేస్తున్నా మని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకునే వారికి అన్ని రకాల సౌకర్యాలను తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశామని, ప్రజలందరూ స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృషి సారించి అభివృద్ధి పరుస్తున్నారని గుర్తు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని హంగుల్లో అబివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. రానున్న రెండేళ్ళ కాలంలో పెద్దపల్లి రూపురేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్త చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.