పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:23 AM
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం చీకురాయి, భోజన్నపేట, హన్మంతునిపేట గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేసి ముగ్గులు పోశారు.
పెద్దపల్లి రూరల్ , జూలై 9 (ఆంధ్రజ్యోతి) : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం చీకురాయి, భోజన్నపేట, హన్మంతునిపేట గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేసి ముగ్గులు పోశారు. భోజన్నపేట, చీకురాయి, హన్మంతునిపేట గ్రామాల్లో కోటి 37 లక్షలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. భోజన్నపేటలో మహిళ శక్తి టైలరింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. హనుమంతునిపేటలో వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్క నాటారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. పది సంవత్సరాలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూశారని, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాలో ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 100 మంది చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించామని తెలిపారు. ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ మల్లారెడ్డి, ఎంపీవో ఫయాజ్, మాజీ జడ్పీటీసీ బండారి రామూర్తి, సందనవేణి రాజేందర్, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.