బయో మెడికల్ వ్యర్థాలతో పొంచిఉన్న ముప్పు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:00 AM
జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు బయోమెడికల్ వ్యర్థాలను రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, మురికి కాలు వల్లో పడేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నియమించిన బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ సంస్థలకు చెందిన వాహనాలకు ఇవ్వకుండా ఇష్టాను సారం రోడ్లపై వేస్తున్నారు.
కోల్‌సిటీ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు బయోమెడికల్ వ్యర్థాలను రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, మురికి కాలు వల్లో పడేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నియమించిన బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ సంస్థలకు చెందిన వాహనాలకు ఇవ్వకుండా ఇష్టాను సారం రోడ్లపై వేస్తున్నారు. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ సంస్థలకు ఫీజులు చెల్లించవలసి వస్తుందని మెడికల్ వేస్ట్‌ను రోడ్లపై వేసి ప్రజలు, మున్సిపల్ సిబ్బం ది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఆసుపత్రులు, పశు వైద్యశాలల్లో వినియోగించిన సిరంజిలు, సెలైన్లు, మెడికల్ కాటన్ వేస్ట్, తొలగించిన అవయవాలను మెడికల్ వ్యర్థాలుగా పరిగణిస్తారు. వీటిని ఆసుపత్రుల్లో వేరు చేసి తెలుపు, ఎరుపు, పసుపు రంగు డబ్బాల్లో వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. వాటిని కాలుష్య నియంత్రణ మండలి గుర్తించి మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు చెందిన వాహనాలకు అందిం చాలి. వాటిని సదరు మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రత్యేక ఇన్సనరేటర్స్‌లో కాలుస్తుంది. అనంత రం ఆ వ్యర్థాలను భూమిలో పూడ్చిపెడతారు. ఈ మెడి కల్ వ్యర్థాల నిర్వహణకు కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ సూచించిన ఫీజులను వసూలు చేస్తారు.
వందల సంఖ్యలో ఆసుపత్రులు, ల్యాబ్‌లు...
జిల్లాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలి టీలు, పలు మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రామగుండంలో మెడికల్ కళాశాల అనుబంధంగా 350 పడకల ఆసుపత్రి, సింగరేణికి చెందిన మరో 300 పడ కల ఆసుపత్రి, ఎన్‌టీపీసీలో 50పడకల ఆసుపత్రు లున్నాయి. పెద్దపల్లిలో 100పడకల ప్రభుత్వ ఆసుపత్రి తోపాటు జిల్లాలో 10నుంచి 50పడకల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, డెంటల్ క్లీనిక్‌లు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు, మెడికల్ ల్యాబ్‌లు ఉన్నాయి. రోజు ఈ ఆసుపత్రులు, ల్యాబ్‌ల నుంచి కిలోల కొద్ది మెడికల్ వేస్ట్ వెలువడుతుంది. ఈ మేరకు బయో మెడికల్ రూల్స్ 1998 ప్రకారం కాలుష్యనియంత్రణ మండలి గుర్తించిన సంస్థ నుంచి సర్టిఫికెట్ పొంద డంతోపాటు వ్యర్థాలను నిర్వీర్యం చేసేందుకు సదరు సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు నెలకు కనీసంగా రూ.500 నుంచి ఆసుపత్రుల స్థాయిలను బట్టి రూ.10వేల వరకు ఫీజు ఉంటుంది. జిల్లాలోని మెజార్టీ ఆసుపత్రులు, ల్యాబ్‌లు నెలవారీ ఫీజులకు కక్కుర్తిపడి మెడికల్ వేస్ట్‌ను రోడ్లపై వేస్తున్నారు. ఆప రేషన్‌లలో తొలగించి అవయవాలను ఏకంగా మున్సి పల్ నాలాల్లో వేస్తున్నారు. దీంతో వైరస్ వ్యాపిస్తుంది.
మున్సిపల్ సిబ్బంది ప్రాణాలతో చెలగాటం...
ఆసుపత్రుల నిర్వాహకులు బయో మెడికల్ వేస్ట్‌ను ఏకంగా రోడ్లపై వేస్తున్నారు. ఈ రహదారి గుండా వెళ్లే ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. పలు సందర్భాల్లో చిన్న పిల్లలు నిడిల్స్, సిరంజిలతో ఆడుకుని అనారోగ్యం పాలైన ఘటనలు ఉన్నాయి. చెత్త తొలగించే మున్సిపల్ సిబ్బందికి నెలకు రూ.100 నుంచి రూ.200 ఇచ్చి వారితో వాటిని తీసుకెళ్లేలా చేస్తున్నారు. దీంతో తెలియకుండానే మున్సిపల్ సిబ్బంది ప్రాణాంతకమైన జబ్బుల బారిన పడుతున్నారు. గతంలో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో ఈ తరహా మెడికల్ వేస్ట్‌ను మున్సిపల్ వాహనాల్లో వేయడం వివాదాస్పదమైంది.
కంపోస్ట్‌యార్డులో విస్తరిస్తున్న వైరస్...
మెడికల్ వేస్ట్‌ను మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లి కం పోస్టు యార్టులో వేస్తుండడంతో ఆ ప్రాంతంలో ప్రాణాంతకమైన వైరస్‌లు విస్తరిస్తున్నట్టు పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. రోజు డంపింగ్ వాహనాలు నడిపే డ్రైవర్లు వైరస్ బారిన పడి జ్వరం, శ్వాసకోశ వ్యాధులు, ఇతర ప్రాణాంతక జబ్బులకు గురవుతు న్నారు.
తనిఖీలు జరుపని కాలుష్య నియంత్రణ మండలి
జిల్లాలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ తీరుపై కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు జరుపాల్సి ఉం టుంది. రామగుండంలో కాలుష్య నియంత్రణ మం డలి ప్రాంతీయ కార్యాలయం ఉన్నా ఏరోజు ఆసుపత్రుల్లో తనిఖీలు జరపలేదనే విమర్శలున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ఎన్‌ఓసీ ఇచ్చే సమయంలో మామూళ్లు వసూలు చేస్తున్నారని, ఎస్‌టీపీలు లేకున్నా అనుమతులు ఇస్తున్నారనే విమర్శలున్నాయి.
కార్పొరేషన్ కొరడా...
కార్పొరేషన్ పారిశుధ్య విభాగానికి చెందిన పలువురు కార్మికులు అనారోగ్యాల బారిన పడడం, ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంలో నగరపాలక సంస్థకు ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అరుణశ్రీ కఠిన చర్యలకు ఆదేశించారు. మున్సిపల్ చట్టం ప్రకారం అపరాధ రుసుములు వసూలు చేయాలని ఆదేశించారు. దీంతో రామగుండం నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది రెండు రోజుల క్రితం గోదావరిఖనిలోని రెండు ఆసుప త్రులు, ల్యాబ్‌లకు భారీ జరిమానా విధించారు. లక్ష్మీనగ ర్‌లోని అదితి ఆసుపత్రికి రూ.1లక్ష, మరో ఆసుపత్రికి రూ.50వేలు, ఒక ల్యాబ్‌కు రూ.10వేల జరిమానా విధించారు.