గౌతమ బుద్ధుడి బోధనలు మానవాళికి ఆచరణీయం
ABN , Publish Date - May 12 , 2025 | 11:46 PM
గౌతమ బుద్ధుడి బోధనలు విశ్వమానవాళికి ఆచరణనీయమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వడుకాపూర్ గ్రామ పరిధిలో గల అతి ప్రాచీన బౌద్ధ స్తూపం వద్ద సోమవారం బుద్దపూర్ణిమను పురస్కరించుకుని జూలపల్లి, ఎలిగేడు మండలాల దళిత సంఘాల నాయకులు, బౌద్ధిస్టులు గౌతమ బుద్ధుడి జయంతి ఘనంగా నిర్వహించారు.
జూలపల్లి/ఎలిగేడు, మే 12 (ఆంధ్రజ్యోతి) గౌతమ బుద్ధుడి బోధనలు విశ్వమానవాళికి ఆచరణనీయమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వడుకాపూర్ గ్రామ పరిధిలో గల అతి ప్రాచీన బౌద్ధ స్తూపం వద్ద సోమవారం బుద్దపూర్ణిమను పురస్కరించుకుని జూలపల్లి, ఎలిగేడు మండలాల దళిత సంఘాల నాయకులు, బౌద్ధిస్టులు గౌతమ బుద్ధుడి జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయరమణారావు బుద్ధుడి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మానవజాతికి సహనాన్ని, ప్రేమతత్వాన్ని, అహింసను, శాంతిని పంచిన బుద్ధుడి బోధనలు అందరికి ఆదర్శంగా నిలిచాయన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యే పంచశీల జెండాను ఆవిష్కరించారు. బుద్ధక్షేత్రానికి రావడానికి రహదారి సరిగా లేదని, తారురోడ్డు నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ దేవా శ్రీనివాస్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేహదానం అవయవదాన పత్రాన్ని అందించారు. ఎస్‌ఐ సనత్‌కుమార్, విశ్రాంత సబ్‌ఇన్‌స్పెక్టర్ పుల్లయ్య కాంబ్లే, దేవ శ్రీనివాస్, పర్శరాములుగౌడ్, మొగురం రమేష్, పాటకుల భూమయ్య, పలువురు నాయకులు బౌద్దిస్టులు, పాల్గొన్నారు.