Share News

ప్రశ్నార్థకమవుతున్న ప్రభుత్వ పాఠశాలల మనుగడ

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:31 AM

ప్రభుత్వ పాఠశాలల మను గడ ప్రశ్నార్థకమవుతోందని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, తెలం గాణ విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనై జింగ్‌ సెక్రెటరీ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, రఘుశంకర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నార్థకమవుతున్న ప్రభుత్వ పాఠశాలల మనుగడ

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల మను గడ ప్రశ్నార్థకమవుతోందని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, తెలం గాణ విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనై జింగ్‌ సెక్రెటరీ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, రఘుశంకర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మల్క రాంకిషన్‌రావు అధ్యక్ష తన శనివారం ట్రినిటి డిగ్రీ కళాశాల ఆడి టోరియంలో జరిగింది. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రకటిత రా జ్యాంగ లక్ష్యాలను విస్మరిస్తూ విద్యా ప్రైవే టీకరణను కార్పొరేట్‌కరణను ప్రోత్సహి స్తున్నాయని విమర్శించారు.

ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతు న్నాయని, విద్యార్థుల సంఖ్య తగ్గి మనుగడకే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి రవిచందర్‌, డీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వ అధ్య క్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్యాం, అప్పిడి సంతోష్‌రెడ్డి, పరుశ రాములు, పోచయ్య, జీవన్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:31 AM