Share News

విద్యార్థుల శాస్ర్తీయ ఆలోచనలు భేష్‌

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:03 AM

ఎన్‌టీపీసీ జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ గురువారంతో ముగిసింది. దీనికి ముఖ్యఅతిథిగా పా ల్గొన్న జిల్లా విద్యాధికారి శారద మాట్లాడుతూ విద్యా ర్థులు శాస్ర్తీయ ఆలోచన బేష్‌గా ఉందని, సృజనాత్మక ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు.

విద్యార్థుల శాస్ర్తీయ ఆలోచనలు భేష్‌

జ్యోతినగర్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీపీసీ జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ గురువారంతో ముగిసింది. దీనికి ముఖ్యఅతిథిగా పా ల్గొన్న జిల్లా విద్యాధికారి శారద మాట్లాడుతూ విద్యా ర్థులు శాస్ర్తీయ ఆలోచన బేష్‌గా ఉందని, సృజనాత్మక ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. జిల్లా స్థాయిలో జరిగిన మెయిన్‌ థీమ్‌లో వికసిత భార త్‌, ఆత్మ నిర్బర్‌ భారత్‌ కోసం ఏర్పాటు చేసిన బాల వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. వృక్షాలను రక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ భాగస్వామ్యం కావాలన్నారు. మూడు రోజుల్లో విద్యార్థుల ప్రదర్శనల సబ్‌ థీమ్స్‌ సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్‌ఎనర్జీ, ఎమర్జింగ్‌ టెక్నాలజీ, రిక్రియేషన్‌ మథెమ టికల్‌ మాడలింగ్‌, హెల్త్‌, జైజీన్‌, నీటి సంరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు 218 నమూనాలను ప్రదర్శిం చారు. వీటిలో సీనియర్ల విభాగంలో ఏడు, జూనియర్ల విభాగంలో ఏడు ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో ఎం పికైన విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలి పారు. పలువురు అతిథులు విజేతలకు మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు. విద్యార్థులకు క్విజ్‌ కార్య క్రమం నిర్వహించి, బహుమతులు అందజేశారు. జిల్లా సైన్సు అధికారి హనుమంతుతోపాటు రామగుండం మండల విద్యాధికారి మల్లేశం, మండలాల విద్యాధికా రులు సురేంద్రకుమార్‌, హరిప్రసాద్‌, విమల, కొముర య్య, హెచ్‌ఎంలు స్వర్ణలత, ఆగయ్య, రాంరెడ్డి, ఓదెలు, మల్లారెడ్డి, చంద్రయ్య, శ్రీనివాసచారి పాల్గొన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి రవినందన్‌రావు నివేదిక సమర్పించగా, ముగింపు రోజు ప్రదర్శన చేసి పలు సైన్స్‌ ఆవిష్క రణలు, ప్రయోగాలను జడ్పీ ఉన్నత పాఠశాల నరసిం హపురం, మల్యాలపల్లి, విలేజ్‌ రామగుండం, దుర్గయ్య పల్లి, ఎన్‌టీపీసీ స్పెక్ర్టాహైస్కూల్‌, 8వ కాలనీ సింగరేణి హైస్కూల్‌ నుంచి వచ్చాయి.

Updated Date - Dec 05 , 2025 | 12:03 AM