సమ్మె విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:31 PM
కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఖనిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
గోదావరిఖని, జూలై 5(ఆంధ్రజ్యోతి): కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఖనిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆర్‌జీ-1 బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదా వరిఖని శ్రామిక భవన్ నుండి మెయిన్ చౌరస్తా, తిలక్‌నగర్, రమేష్‌నగర్, కళ్యాణ్ నగర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని, ఈ కోడ్స్ అమలైతే కార్మిక హక్కులు కోల్పోతారని, పెట్టుబడుదా రులకు అనుకూలంగా ఉన్న ఈ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను సింగ రేణికి కేటాయించాలని, వేలం రద్దు చేయా లని డిమాండ్ చేశారు. ఆర్‌జీ-1అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, అసరి మహేష్, అనబోయిన శంకరన్న, పుప్పాల శ్రీనివాసరావు, పెండెం సమ్మయ్య, నంది నారాయణ, పిరుమల శ్రీనివాస్, జంగాపల్లి మల్లేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, ఇప్పలపల్లి సతీష్, దుర్గాప్రసాద్, పాలేటి నరేష్, జనార్ధన్, భీమా నాయక్, తిప్పారపు రాజు, రామన్న, మహేందర్, ఎం రాజే ష్ పాల్గొన్నారు,