రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:08 AM
గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 7 న హైదరాబాద్ సుందర య్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్ర దం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయు) రాష్ట్ర నాయకులు కాదాసీ లింగమూర్తి పిలుపునిచ్చారు.
పెద్దపల్లి టౌన్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 7 న హైదరాబాద్ సుందర య్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్ర దం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయు) రాష్ట్ర నాయకులు కాదాసీ లింగమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర సదస్సు పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడుతూ కనీస వేతనం లేక కార్మికుల జీవితం అంధకారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దా నం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పం చాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు బాబు, బాలకృష్ణ, శివ, సుమన్, పాల్గొన్నారు.
రామగిరి, (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఈనెల 7న నిర్వహించే ఐఎఫ్‌టీయు రాష్ట్ర సదస్సును విజయవం తం చేయాలని సెంటినరీకాలనీలో ఐఎఫ్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న ఆధ్వర్యంలో కాం ట్రాక్టు కార్మికులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. నాయకులు రమేశ్, రాజనర్సు, సంపత్, సురేష్, శ్రీనివాస్, రాజమౌళి, రమేశ్, ఎల్లయ్య, పాల్గొన్నారు.