Share News

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:46 AM

వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు సింగరేణి కార్మి కులు పాల్గొని కేసీఆర్‌కు మద్దతుగా నిలువాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

గోదావరరిఖని, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు సింగరేణి కార్మి కులు పాల్గొని కేసీఆర్‌కు మద్దతుగా నిలువాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు. శనివారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే11వ గని వద్ద కార్మికులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్‌కు మద్దతుగా సింగరేణి కార్మికులు చేపట్టిన సకల జనుల సమ్మె చరి త్రలో నిలిచిపోతుందన్నారు. నాడు జాతీయ పార్టీలు పోగోట్టిన వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్‌ కారుణ్య నియామాకాల ద్వారా తిరిగి సింగరేణి సంస్థలో ఉద్యో గాలు కల్పించారని గుర్తు చేశారు. 25సంవత్సరాల బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ అనేక విష యాలు మాట్లాడానున్నరన్నారు. సింగరేణి కార్మికు లకు అండగా నిలిచామని, వారికి ఏ కష్టం వచ్చినాటీబీజీకేఎస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుగా ఉన్నా యన్నారు. కనివిని ఎరుగని రీతిలో పండగ వాతా వరణంలో జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కార్మి కులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. టీబీజీకేఎస్‌ నాయకులు మాదాసు రామమూర్తి, నూనె కొమురయ్య, వడ్డేపల్లి శంకర్‌, పర్లపల్లి రవి, బీఆర్‌ఎస్‌ నాయకులు కౌశిక హరి, గోపు అయి లయ్య యాదవ్‌, జోసెఫ్‌, వెంకటేష్‌, రామరాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:46 AM