పోలీసు అమరుల సేవలు అజరామరం
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:51 PM
పోలీసు అమరవీరుల అజరామరమని ప్రతీ ఒక్కరు వారి సేవలను స్మరించుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి మండలాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
కాల్వశ్రీరాంపూర్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల అజరామరమని ప్రతీ ఒక్కరు వారి సేవలను స్మరించుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి మండలాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎస్‌ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ చేపట్టారు.
డీసీపీ కరుణాకర్, ఏసీపీలు గజ్జి కృష్ణ, రమేష్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమై, ప్రధాన వీధుల గుండా సాగుతూ బేగంపేట చౌరస్తా వరకు కొనసాగించారు. డీసీపీ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు మరిచి పోలేనివన్నారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐలు వెంకటేష్, సనత్‌రెడ్డి, మధుకర్, రమేష్ గౌడ్, పాల్గొన్నారు.