Share News

మలి విడత పోరు ఫైనల్‌

ABN , Publish Date - Dec 07 , 2025 | 01:07 AM

పల్లె ఎన్నికల సంగ్రామం ఊపందుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. రెండో విడత నామి నేషన్లు ఉపసంహరణ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. మలి విడత అభ్యర్థుల లెక్క తేలడంతో ప్రచారం ఊపందుకోనున్నది.

మలి విడత పోరు ఫైనల్‌

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పల్లె ఎన్నికల సంగ్రామం ఊపందుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. రెండో విడత నామి నేషన్లు ఉపసంహరణ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. మలి విడత అభ్యర్థుల లెక్క తేలడంతో ప్రచారం ఊపందుకోనున్నది. మరోవైపు తుది విడత నామినేషన్లు ముగియడంతో ఉపసంహరణల గడువు 9 వ తేదీ వరకు ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులను బుజ్జగింపులు, ఒత్తిళ్లతో ఉపసంహరణకు పార్టీల నేతలు, పలుకుబడి వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి, రెండు విడతల్లో నామినేషన్ల ముగిసి గుర్తులు కేటాయించడంతో ప్రచార సందడితో గ్రామాలు కోలాహలంగా మారాయి. మొదటి విడతలో 295 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 1377 మంది వార్డు అభ్యర్థులు బరిలో ఉండగా రెండో విడతలో 279 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 1342 మంది వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో నామినేషన్ల పరిశీలన తరువాత 514 మంది సర్పంచ్‌ అభ్యర్థులు,1834 మంది వార్డు అభ్యర్థులు ఉన్నారు.

ఫ జిల్లాలో 27 సర్పంచ్‌లు ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామ పంచాయతీల్లో తొలి, మలి విడతలతో పాటు కొనసాగుతున్న మూడో విడతలో కలిపి 27 మంది సర్పంచులు, 2268 వార్డు స్థానాల్లో 295 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. తొలి విడతలో ఐదు మండలాల్లో 85 సర్పంచ్‌ స్థానాల్లో 9 మంది సర్పంచులు, 229 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. రుద్రంగి మండలంలో 10 గ్రామపంచాయతీలు ఉండగా గిరిజన తండాల్లో ఏడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో 88 సర్పంచ్‌ స్థానాల్లో 11 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా 758 వార్డుల్లో 182 వార్డులు ఏకగ్రీవమయ్యాయ. తుది విడతలు 87 పంచాయతీలు, 762 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు ఉపసంహరులు ఈనెల 9 తేదీ వరకు గడువు ఉంది. నామినేషన్లు ఉపసంహరణ వరకు 11 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు మొదటి విడతలో ఏకగ్రీవ సర్పంచులో రుద్రంగి మండలంలో అడ్డబోరు తండ సర్పంచ్‌గా గూగులోతు మంజుల, గైదీగుట్ట తండా సర్పంచ్‌గా ఇస్లావత్‌ కిషన్‌, వీరునితండా సర్పంచ్‌గా గుగులోతు మంజుల, చింతామణితండా సర్పంచిగా గుగులోతు సింధుజ, బడితండా సర్పంచ్‌గా మాలోతు రాందాస్‌, రూప్లానాయక్‌ తండా సర్పంచ్‌గా భూక్య జవహర్‌లాల్‌, సర్పంచ్‌ తండా సర్పంచ్‌గా మాలోత్‌ రజితలతో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోనరా వుపేట మండలంలో ఊరుతండా సర్పంచ్‌గా ఇస్లావత్‌ మంజుల, కుమ్మరిపేటతండా సర్పంచ్‌గా మాలోతు మంజులలు వార్డు సభ్యులతో సహా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రెండో విడతలో తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్‌ పూర్‌ సర్పంచ్‌గా జూపల్లి రమాదేవి, ఉపసర్పంచ్‌గా లింగంపల్లి ప్రదీప్‌, బాలమల్లు పల్లె సర్పంచ్‌గా యాద ఎల్లయ్య, ఉప సర్పంచ్‌గా దోరగోళ్ల రాజు,గండిలచ్చపేట సర్పంచ్‌గా జంగిటి అంజయ్యలతో పాటు ఏకగ్రీవమయ్యారు. ఇల్లంతకుంట మండలంలో చిక్కుడువాని పల్లె సర్పంచ్‌గా కళ్యాణ్‌, తిప్పాపూర్‌ సర్పంచ్‌గా బోల్లవేణి మంజుల, కేసన్నపల్లి సర్పంచ్‌గా పోతరాజు చంటి, ముస్కాన్‌ పేట సర్పంచిగా కోమటి రెడ్డి భాస్కర్‌ ెడ్డి, గాలిపెళ్లి సర్పంచ్‌ గా బద్దం శేఖర్‌ రెడ్డి, పత్తి కుంటపల్లె సర్పంచ్‌గా జుట్టు శేఖర్‌, కృష్ణారా వుపల్లె సర్పంచ్‌గా జక్కుల మల్లవ్వలతో పాటు వార్డుల న్నీ ఏకగ్రీవం అయ్యాయి. జంగం రెడ్డిపల్లి సర్పంచ్‌గా పండుగ సునీతతో పాటు నాలుగు వార్డులు ఏకగ్రీవమ య్యాయి. మూడో విడత ఈనెల 9 వరకు ఉపసంహర ణల గడువు ఉన్నప్పటికీ నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి 7 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. గంభీరావుపేట మండలంలో లక్ష్మీపూర్‌ సర్పంచ్‌గా అంజయ్య, దేశాయిపేట సర్పంచ్‌గా జి పద్మ, వీరలాల్‌ తండా సర్పంచిగా భూక్య పద్మ, ముస్తాబాద్‌ మండలం లో సేవాలాల్‌ తండా సర్పంచ్‌గా భూక్య సరిత, ఎల్లారెడ్డిపేట మండలంలో రాగట్లపల్లి సర్పంచ్‌గా లక్ష్మయ్య, గుంటుపల్లి చెరువు తండా సర్పంచ్‌గా తిరుపతి, వీర్నపల్లి మండలం జహార్‌లాల్‌ నాయక్‌ తండా సర్పంచ్‌గా భూక్య హంసలతో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు.

తొలి విడత బరిలో ...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో ఐదు మండలాల్లో 85 సర్పంచ్‌ స్థానాలు ఉండగా తొమ్మిది స్థానాల్లో ఏకగ్రీవం కాగా 76 గ్రామపంచాయతీలు 295 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 229 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా 519 వార్డుల్లో 1377 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

మండలం సర్పంచ్‌ వార్డులు

రుద్రంగి 10 91

వేములవాడ 47 218

వేములవాడ రూరల్‌ 52 262

కోనరావుపేట 122 459

చందుర్తి 64 347

మొత్తం 295 1377

రెండో విడతలో ...

రెండో విడతలో శనివారం నామినేషన్ల ఉపసంహర ణలు ప్రశాతంగా ముగిశాయి. మూడు మండలాల్లో 88 సర్పంచులు, 758 వార్డు సభ్యుల స్థానాలకు ఉండగా సర్పంచ్‌ స్థానాల్లో 11 మంది అభ్యర్థులు, 182 మంది వార్డు ఆభ్యర్థులు ఏకగ్రీవం కాగా సర్పంచ్‌ అభ్యుర్థులు 279 మంది, 1342 వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

మండలం సర్పంచ్‌ వార్డులు

బోయిన్‌పల్లి 90 437

ఇల్లంతకుంట 79 454

తంగళ్లపల్లి 110 451

మొత్తం 279 1296

మూడో విడతలో ...

మూడో విడత ఎన్నికల సర్పంచ్‌ వార్డు సభ్యుల నామినేషన్ల పర్వం ముగిసింది.. నాలుగు మండలాల్లో 87 సర్పంచులు, 762 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. శనివారం నామినేషన్ల పరిశీలన జరిపారు. మిగిలిన నామినేషన్లలో సర్పంచ్‌ స్థానాలకు 514 నామినేషన్లు, 1834 వార్డు సభ్యుల స్థానాలకు నామి నేషన్లు వచ్చాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఉపసంహరణలకు గడువు ఉంది.

మండలం సర్పంచ్‌ వార్డులు

ఎల్లారెడ్డిపేట 142 542

వీర్నపల్లి 86 219

ముస్తాబాద్‌ 170 545

గంభీరావుపేట 116 528

మొత్తం 514 1834

Updated Date - Dec 07 , 2025 | 01:07 AM