Share News

ప్రారంభమైన బడిబాట

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:53 PM

మండల కేంద్రంతోపాటు ఆయాగ్రామాల్లో ఎంఈఓ మహేష్‌, ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్‌ బోధన, ఉచి త యూనిఫామ్‌, శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుందన్నారు.

ప్రారంభమైన బడిబాట

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతోపాటు ఆయాగ్రామాల్లో ఎంఈఓ మహేష్‌, ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్‌ బోధన, ఉచి త యూనిఫామ్‌, శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుందన్నారు.

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు బడి బాట ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని మం డల విద్యాధికారి తానం విమల అన్నారు. కన్నాల ప్రాఽథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాటకు రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఇం టింటి ప్రచారం చేస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచాల న్నారు. కాంప్లెక్స్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు జె కమలాకర్‌రావు, ప్రధానోపాధ్యాయులు జి అంజని దేవి, ఉపాధ్యాయులు రాజయ్య, వి శ్రీనివాస్‌, కుమార్‌, సుజాత పాల్గొన్నారు.

మంథనిరూరల్‌, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేప ట్టిన బడిబాట ప్రారంభమైంది. టీచర్లు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రైవేటు పాఠ శాలలకు వెళ్ళవద్దని, ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంకు సంబంధించిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. పిల్లలను తమ పాఠశా లలకు పంపాలని కోరారు.

కోల్‌సిటీటౌన్‌, (ఆంధ్రజ్యోతి): బడి బాట కార్యక్రమాన్ని గోదావరిఖనిలో ప్రభుత్వ ఉన్నత పాఠ శాల ఉపాధ్యాయులు ఇంటింటి సర్వే చేశారు. బస్టాండ్‌, మార్కండేయ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేశారు. ప్రభుత్వ పాఠశాలలో బోధన, విద్యార్థు లకు కల్పిస్తున్న వసతులపై బడి ఈడు పిల్లల తల్లి దండ్రులకు వివరించారు. విద్యతోపాటు క్రీడలు, సామాజిక సేవ, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందిం చేలా సైన్స్‌ ఫేర్‌ వంటి కార్యక్రమాలను చేపడుతు న్నట్టు తెలిపారు. ప్రధానోపాధ్యా యుడు భూమయ్య, ఉపాధ్యాయులు జగదీశ్వర్‌, సమీర్‌, ప్రేమ్‌కుమార్‌, రమాదేవి, భాగ్యలక్ష్మి, సుభద్ర పాల్గొన్నారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోతో పాటు హరిపురం జడ్పీహెచ్‌ఎస్‌, ఫ్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట ర్యాలీలను నిర్వహించారు. పదో తరగతిలో అధికమార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఫోటోల ఫ్లెక్సీలతో ర్యాలీ చేపట్టారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పి స్తున్న సౌకర్యాల ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఎంఈఓ రమేష్‌, ప్రధానోపాధ్యాయుడు మ హేందర్‌రెడ్డి, సిఆర్పి ఓంకార్‌, మాజీ ఎస్‌ఎంసి చైర్మన్‌ బిక్షపతి, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, పావని, హేమ లత, హైమావతి, రాజు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:53 PM