Share News

పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:20 AM

పాఠ శాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీఈవో మాధవి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలురలో ఉపాధ్యాయులు, పారిశుధ్య కార్మి కులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన పారిశుధ్య చర్యల గురించి నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు.

పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): పాఠ శాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీఈవో మాధవి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలురలో ఉపాధ్యాయులు, పారిశుధ్య కార్మి కులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన పారిశుధ్య చర్యల గురించి నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు. డీఈవో మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల వ్యాప్తిని నిరో ధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉపా ధ్యాయులకు సూచించారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తరగతి గదులు, టాయి లెట్లు, ఆటస్థలాలు, అసెంబ్లీ ప్రాంతాలు, సిబ్బంది గదులు, నీటి ట్యాంకులు ఎలా శుభ్రపరుచుకోవాలనే అంశంపై ప్రతీ మండలం నుంచి ఒక ఉపాధ్యా యుడికి, ఇద్దరు పారిశుధ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చా మన్నారు. ఈనెల 11న మండల కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులపై అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారి సూచించారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత చేతులు కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. మండల విద్యాశాఖ అధికారి టి.సురేందర్‌, రిసోర్స్‌పర్సన్‌ దయాకర్‌, సమన్వయకర్త అజీమ్‌దమీర్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

శుభ్రతతో ఆరోగ్యకరమైన వాతావరణం

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్ర తతో ఆరోగ్యకరమైన వాతావారణం నెలకొంటుందని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. భూపతిపూర్‌ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం పరిశుభ్రత పారిశుధ్యం అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలోని పలు కస్తూర్బా గాందీ విద్యా లయాలకు చెందిన వారితో శిక్షణ సదస్సు నిర్వహిం చారు. డీఈవో విద్యాలయం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రత వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. స్కూల్స్‌ ప్రారంభం అయిన తర్వాత విద్యార్థులకు పరిశుభ్రతతో పాటు వ్యక్తి గత శుభ్రత ఇతర అంశాలపై అవగాహన కల్పించా లన్నారు. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎంలతో, పారిశుధ్య సిబ్బందితో జిల్లా జెండర్‌ ఈక్విటీ కో ఆర్డినేటర్‌ కవిత సమావేశం నిర్వహించారు. పలువురు స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:20 AM