విద్యార్థుల భవిష్యత్‌లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:19 AM
పాఠశాల తరగతి గదుల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఒక విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఒక్క ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటుం దని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని కలెక్ట రేట్‌లో సన్మానించారు
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): పాఠశాల తరగతి గదుల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఒక విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఒక్క ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటుం దని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని కలెక్ట రేట్‌లో సన్మానించారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వేపల్లి రాధా కృష్ణ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన ఆరునెలల్లో పూర్తి చేస్తామన్నారు.
జిల్లాలో అవసరం మేర ఉపాధ్యాయులు అందు బాటులో ఉన్నారని, విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగా లన్నారు. తరగతి గదుల్లో డిజి టల్ క్లాస్ రూం అదనపు సౌక ర్యమేనని, టీచర్లు మాత్రమే కేంద్రంగా తరగతి గదులు ఉం డాల న్నారు. పిల్లలకు మెరుగైన విద్య కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం లో ప్రతి ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు కార్య క్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ కనీసం 80 శాతం విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అం దేలా చూడాలని కలెక్టర్ కోరారు.
పిల్లలపై ఉపాధ్యాయులు చూపించే ప్రభావం జీవిత కాలం ఉంటుందన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 48 మంది టీచర్లకు ప్రశంసాపత్రాలు అందించారు. అదనపు కలెక్టర్ వేణు, జిల్లా విద్యాధికారి మాధవి, జడ్పీ సీఈఓ నరేందర్, పాఠశాల ఉపాధ్యా యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని అలరించిన నృత్యం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.