శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకం
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:30 AM
శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజాభద్రతలతో హోంగార్డుల పాత్ర కీలకమని, వారి త్యాగాలు, బలిదా నాలు మరువలేనివని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శనివారం హోంగార్డ్ రైజింగ్ డే సందర్భంగా కమిషరేట్ పరేడ్ గ్రౌండ్ గౌరవ వందనం స్వీకరించారు.
కోల్‌సిటీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజాభద్రతలతో హోంగార్డుల పాత్ర కీలకమని, వారి త్యాగాలు, బలిదా నాలు మరువలేనివని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శనివారం హోంగార్డ్ రైజింగ్ డే సందర్భంగా కమిషరేట్ పరేడ్ గ్రౌండ్ గౌరవ వందనం స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ హోంగార్డుల సేవలు ప్రశంసనీయమని, శాంతి భద్రతలు, ట్రాఫిక్, కమ్యూనిటీ పోలీస్, క్రైమ్ నివారణ, విపత్తుల నివారణ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. హోంగార్డులు బాధ్యతగా నిర్వహిస్తూ క్రమశిక్షణ, సేవా స్ఫూర్తి ప్రదర్శిస్తూ పోలీస్‌శాఖకే గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రతిభకనబరిచిన హోంగార్డులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పరేడ్ కమాండర్‌గా హోంగార్డ్ ఆర్‌ఐ పెద్దన్న వ్యవహరిం చారు. డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఎస్‌బీ ఏసీపీ నాగేం ద్రగౌడ్, ఏఆర్ ఏసీ పీ ప్రతాప్, ఎస్‌బీఐ భీమేష్, ఆర్‌ఐలు పాల్గొన్నారు.