పోలీసుశాఖలో ఏఆర్ విభాగం పాత్ర కీలకం
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:49 PM
పోలీసు శాఖలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం పాత్ర కీలకమని, శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని రామ గుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో పునరుద్దరణ చేసిన అర్ముడ్ అధికారుల కార్యాలయాలు, సిబ్బంది బ్యారక్ తదితర వాటిని సీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
కోల్‌సిటీ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం పాత్ర కీలకమని, శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని రామ గుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో పునరుద్దరణ చేసిన అర్ముడ్ అధికారుల కార్యాలయాలు, సిబ్బంది బ్యారక్ తదితర వాటిని సీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 15రోజుల పాటు సాగిన ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమం పోలీస్ కవాతులో సీపీ గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ పండుగలు, ఎన్నికల బందోబస్తు, ఊరేగింపులో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసుల కృషి ఎంతో ఉందన్నారు. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. పరేడ్‌కు ఆర్‌ఐ అడ్మిన్ దామోదర్ ప్లాటూన్ కమాండర్‌గా వ్యవహరించారు. డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ జానీ నరసింహులు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, ఆర్‌ఐ దావూదర్, వామన మూర్తి, మల్లేశం, సంపత్ సిబ్బంది పాల్గొన్నారు.