Share News

సమాచార హక్కు చట్టాన్ని గౌరవించాలి

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:44 PM

సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ సమాచారాన్ని సకాలంలో అందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ అన్నారు. సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అవగా హన కల్పించారు.

సమాచార హక్కు చట్టాన్ని గౌరవించాలి

కోల్‌సిటీ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ సమాచారాన్ని సకాలంలో అందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ అన్నారు. సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అవగా హన కల్పించారు. ఆమె మాట్లాడుతూ స్నేహపూర్వ కంగా వ్యవహరిస్తూ సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అం దించాలన్నారు. స్వచ్ఛందంగా సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తామని, పనితీరు లో పారదర్శకత పాటిస్తామని సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. రోడ్లు, భవ నాలశాఖ జగిత్యాల డివిజన్‌ సూపరింటెండెంట్‌, ఆర్‌టీఐ రిసోర్స్‌పర్సన్‌ కిషన్‌, సమా చార హక్కు చట్టంపై సిబ్బందికి అవగాహన కల్పిం చారు. అడిషనల్‌ కమిష నర్‌ మారుతి ప్రసాద్‌, డిప్యూ టీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, సెక్రటరీ ఉమా మహేశ్వర్‌రావు, ఏసీపీ శ్రీహరి, ఆర్‌ఓ ఆంజనేయులు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాజు, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, మెప్మా టీఎంసీ మౌనిక, పాల్గొన్నారు.

కోల్‌సిటీటౌన్‌,(ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం ప్రజల చేతుల్లో వజ్రాయుధం లాంటిదని, ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల పారదర్శక పాలనను సాధించవచ్చని ఆర్‌టీఐ రాష్ట్ర ఆర్గనైజేషన్‌ కన్వీనర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్‌టీఐ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కండేయకాలనీ లోని ట్రినిటీ డిగ్రీ కళాశాలలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత-ప్రజాస్వామ్యంలో పౌరుని హక్కులు అనే అంశంపై విద్యార్థులకు అవగా హన కల్పించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజ లకు ప్రభుత్వ విభాగాల కార్యకలాపాలపై స్పష్టమైన సమాచారం తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. నియోజకవర్గం కన్వీనర్‌ ఎం.రాజేశం, కోకన్వీ నర్లు పిట్టల రాజ్‌కుమార్‌, మహ్మద్‌ తాజోద్ధిన్‌బాబా, రాష్ట్ర మహిళా కోకన్వీనర్‌ సోమలక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్‌ కె.యుగంధర్‌, కమిటీ సభ్యులు సురేష్‌, చిరంజీవి, శ్రీని వాస్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 11:44 PM