రైల్వే బ్రిడ్జి పూర్తి చేసి సర్వీస్ రోడ్ నిర్మించాలి
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:45 PM
పెద్దపల్లి-కునారం రోడ్డు లోని రైల్వే ఫ్టైవోవర్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేసి సర్వీస్‌రోడ్డు పనులు చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ గేటు పడితే కాల్వశ్రీరాంపూర్ మార్గంలో వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు.
పెద్దపల్లిటౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి-కునారం రోడ్డు లోని రైల్వే ఫ్టైవోవర్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేసి సర్వీస్‌రోడ్డు పనులు చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ గేటు పడితే కాల్వశ్రీరాంపూర్ మార్గంలో వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. 9 ఏళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో అప్పటి ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా పనులు వేగవంతం కాలేదన్నారు. రైల్వే గేట్లు పడ డంతో ఎమర్జెన్సీ అత్యవసర కేసుల విషయంలో అనేకమంది ఇబ్బం దులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనుల విష యంలో పట్టించుకోకపోవడం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నా యన్నారు. ఆర్‌అండ్‌బి శాఖ సర్వీస్ రోడ్ల విషయంలో పట్టించుకోని కారణంగా రోడ్లపై గుంతలు, దుమ్ముధూళితో స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని, వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు శిలారపు పర్వతాలు తంగేడా రాజేశ్వరరావు, పోల్సాని సంపత్ రావు, చిలివేరి సంపత్, కావేటి రాజగోపాల్, మేకల శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.