ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నిలిచిన ఉత్పత్తి
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:52 PM
రామగుండం ఫెర్టిటైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో సోమవారం తెల్లవారుజామున యూరియా ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. యూరియా ప్లాంట్‌లో గ్యాస్ పైప్‌లైన్‌కు సంబంధించి సాంకేతిక సమస్యతో లీకేజీ ఏర్పడింది. దీంతో యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు.
కోల్‌సిటీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిటైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో సోమవారం తెల్లవారుజామున యూరియా ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. యూరియా ప్లాంట్‌లో గ్యాస్ పైప్‌లైన్‌కు సంబంధించి సాంకేతిక సమస్యతో లీకేజీ ఏర్పడింది. దీంతో యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు. అమ్మోనియా ఉత్పత్తి కొనసాగు తోంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ సాంకేతిక నిపుణులు యూరియా ప్లాంట్ మర మ్మతు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరమ్మతు పూర్తవుతుందని ఆర్‌ఎఫ్‌సీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో రోజుకు 2200 టన్నుల అమ్మోనియా, 3850టన్నుల యూరియా ఉత్పత్తి జరుగాల్సి ఉంది. హెచ్‌టీఆర్ వైఫల్యంతో ఇప్పటికే అమ్మోనియా, యూరియా ఉత్ప త్తులపై ప్రభావం పడింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని 3850టన్నుల నుంచి 3500టన్నులకు కుదించారు. ఈ ఏడాది సాంకేతిక వైఫల్యాలతో సుమారు 4నెలలపాటు ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచి పోయింది. మరమ్మ తు పూర్తయి అక్టోబరులో ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నెలలో ఇప్పటి వరకు 12వేల టన్నుల యూరియా సరఫరా చేశారు. మళ్ళీ సాంకేతిక సమస్యలతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది.