పోలీసులు క్రమశిక్షణతో పని చేయాలి
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:49 PM
పోలీసులంటే ప్రజల్లో గౌరవం పెంచే విధంగా క్రమశిక్షణతో, నిజాయితీతో పని చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్ ఝా సూచించారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడారు.
కోల్‌సిటీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పోలీసులంటే ప్రజల్లో గౌరవం పెంచే విధంగా క్రమశిక్షణతో, నిజాయితీతో పని చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్ ఝా సూచించారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడారు. పెండింగ్, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు.
పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల వివరాలు, వారిపై ఉన్న కేసులు, కదలికల గురించి వాకబు చేశారు. అనుమానితులు, కేడీలు, డీసీల వివ రాలు తెలుసుకున్నారు. సిబ్బంది ఆయుధాలు వినియోగించే తీరు పరిశీలిం చారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, నిబద్దతతో, నిజాయితీతో వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, వారి పట్ల మర్యాదతో వ్యవహరించాలన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసు అధికారులు, సిబ్బంది పని తీరును సీపీ అభినందించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ రమేష్, వన్‌టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.