పోలీసులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:51 PM
పోలీసుస్టేషన్‌లో అన్ని విధులు అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా నిర్వహించాలని అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ ఆదేశించారు. పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో రామ గుండం కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓ, మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పోలీసుస్టేషన్‌లో అన్ని విధులు అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా నిర్వహించాలని అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ ఆదేశించారు. పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో రామ గుండం కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓ, మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి డీసీపీ కార్యాలయానికి వచ్చిన అడిషనల్ డీజీపీని పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మర్యాదపూర్వకంగా మొక్కను అందచేసి స్వాగతం పలకగా, అనంతరం ఏఆర్ సాయిద దళ సిబ్బంది గౌరవ వందనం అందించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహిస్తున్న డ్యూటీలు, పని ప్రదేశంలో సమస్యలపై తెలుసుకున్నారు. పిటిషన్ ఎంక్వయిరీ, పెట్రోలింగ్, నైట్‌డ్యూటీ, కోర్ట్ డ్యూటీ లు చేయడానికి మహిళా సిబ్బంది ధైర్యంగా ఉండాలన్నారు. డీసీపీ కరుణా కర్, గోదావరిఖని ఏసీపీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, గోదావరిఖని 1 టౌన్ సీఐ ప్రసాద్ రావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.