పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
ABN , Publish Date - May 23 , 2025 | 11:24 PM
పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలలో కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో నైపుణ్య అభివృద్ధి పెంపొందించేలా, విద్యార్థులు అన్ని రంగాలలో రాణించేలా బోధనాభ్యాస ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు.
పెద్దపల్లి కల్చరల్, మే 23 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలలో కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో నైపుణ్య అభివృద్ధి పెంపొందించేలా, విద్యార్థులు అన్ని రంగాలలో రాణించేలా బోధనాభ్యాస ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే బోధనాభ్యాసన ప్రక్రియలు, విద్యార్థుల అభివృద్ధి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. వారిలో విశ్వాసం పెంపొందించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాద్యాయులు కొమురయ్యను సన్మానించారు. జిల్లా విద్యాధికారి మాధవి, మండల విద్యాధికారి సురేందర్ కుమార్, డిసిబి సెక్రటరీ హన్మంతు, సెక్టోరల్ అధికారులు పిఎం షేక్, ప్రధానోపాధ్యాయురాలు అరుణ పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): పాఠశాల తరగతి గదులలలో దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని, ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. గర్రెపల్లి మోడల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సందర్శించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా పిల్లలను అలోచింప చేసే విధంగా బోధనలు ఉండాలన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆరెపల్లి రాజయ్య తదితరులు ఎమ్మెల్సీని సన్మానించారు.