రాష్ట్రంలో రాబోయేదీ బీజేపీ ప్రభుత్వమే
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:13 AM
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని, కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల పూర్తి చేసుకున్న సం దర్భంగా ‘వికసిత్ భారత్ అమృతకాల సేవ, సుసరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు’ పేరుతో సమావేశం నిర్వహించారు.
ధర్మారం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని, కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల పూర్తి చేసుకున్న సం దర్భంగా ‘వికసిత్ భారత్ అమృతకాల సేవ, సుసరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు’ పేరుతో సమావేశం నిర్వహించారు. గుజ్జుల మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మపురి నియోజక వర్గంలో జడ్‌పీటీసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాల నుకునే నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. 10 సంవత్స రాలు పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టిందని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టును వాడకున్న తెలంగాణలోని రైతులు పంట దిగుబడి బ్రహ్మాండంగా వస్తుందని, అలాంటప్పుడు కాళేశ్వరంతో పనేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే రాష్ట్ర ప్రభు త్వాలు నడిపిస్తున్నాయని, ఈ విషయాలను ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. కాసిపేట లింగయ్య మాట్లాడుతూ దేశంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రేస్ పార్టీ అనేక కుంభకోణాలకు పాల్పడగా, రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమే ధ్యేయంగా 11 సంవత్సరాల సుపరి పాలనను బీజేపీ పూర్తి చేసుకుందని సంతోషం వ్యక్తం చేశారు. ధర్మారం చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దేవి రాజలింగయ్య, ధర్మపురికి చెందిన ఇందారపు వాసు బీజేపీలో చేరారు.
పోలీసులు బల్ల కింద చేయి పెట్టనిదే రోజు గడవదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు గుజ్జుల కౌంటర్ ఇచ్చారు. కొప్పుల ఈశ్వర్‌కు పదవి పోయాక అవినీతిపై జ్ఞానోదయం కలిగిందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో అవినీతి జరిగిందని ఈశ్వర్ పరోక్షంగా ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ధర్మ పురి నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్ము రాంబాబు, జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, కన్నం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.