మస్టర్ల నిబంధనను వెనక్కి తీసుకోవాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:46 PM
సింగరేణి యాజమాన్యం ఇటీవల 150మస్టర్లు ఉంటేనే రెగ్యులరైజేషన్ చేస్తామని తీసుకువచ్చిన సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబరు 23న యాజమాన్యం విడుదల చేసిన సర్క్యూలర్ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు.
గోదావరిఖని, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): సింగరేణి యాజమాన్యం ఇటీవల 150మస్టర్లు ఉంటేనే రెగ్యులరైజేషన్ చేస్తామని తీసుకువచ్చిన సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబరు 23న యాజమాన్యం విడుదల చేసిన సర్క్యూలర్ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. నెలలో 19మస్టర్లు ఉండాలని నోటీసు బోర్డులో వేయడం కార్మికులను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. సంవత్సరకాలమంతా పని చేసి కేవలం ఒక నెలలో సర్ఫేస్ అయితే 20, అండర్ గ్రౌండ్ అయితే 16కు తక్కువ మస్టర్లు ఉన్న కార్మికులను పిలిచి బెదిరించడంతో కార్మికులు మనో ధైర్యాన్ని కోల్పోతున్నారన్నారు.
ఈ నిబంధనను వెంటనే తొలగించాలన్నారు. ఎడెనిమిది నెలలుగా మెడికల్ బోర్డు పెట్టడం లేదని, దీంతో రెండు సంవత్సరాల సర్వీస్ నిబంధన ఉన్న కార్మికులు ఇబ్బందులు పడుతున్నారనన్నారు. సింగరేణిలో వీఆర్‌ఎస్ కాకుండా సీఆర్‌ఎస్‌ను తీసుకువచ్చి కార్మికులను కంపెనీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిపై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీబీజీకేస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, కోశాధికారి చెల్పురి సతీష్. జాయింట్ సెక్రెటరీ పానుగంటి సత్తయ్య, నాయకులు పొగాకు రమేష్, రొడ్డ సంపత్, వాసర్ల జోసెఫ్, అన్వేష్, పల్లె సురేందర్, మురళీకృష్ణ, వెంకట్‌రెడ్డి, రమేష్, పులిపాక శంకర్, నరేష్ కుమార్ పాల్గొన్నారు.