Share News

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:35 PM

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. మంగళవారం మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్‌లో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. మంగళవారం మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్‌లో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి రామాయాణాన్ని అందించారని, ఈ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందిం చారని ఆయన పేర్కొన్నారు. ఆదర్శంగా ఎలా ఉండాలో రామాయణం ద్వారా నేర్చుకోవచ్చన్నారు. మానవ సంబంధాలు, లక్షణాలు, విలువలను మహాకవి చక్కగా రామాయణంలో పొందుపర్చారని తెలిపారు. ప్రపం చంలో మన ధర్మాన్ని పలువురు ఆచరిస్తున్నారని అన్నారు. వాల్మీకి కవి జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జడ్పీ సీఈఓ నరేందర్‌, అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 11:35 PM