మహాత్ముడి జీవితం అందరికి ఆదర్శం
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:16 PM
జాతిపిత మహాత్మాగాంధీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింస మార్గాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆయన జీవితం అందరికి ఆదర్శమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్ ఝా పేర్కొన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా కమిషనరేట్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కోల్‌సిటీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మాగాంధీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింస మార్గాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆయన జీవితం అందరికి ఆదర్శమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్ ఝా పేర్కొన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా కమిషనరేట్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుం దన్నారు. దేశ పౌరులు గాంధేయమార్గంలో నడుచుకోవాలని, గాంధీ చూపిన బాటలో విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీస్ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ భీమేష్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.