Share News

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల కీలక పాత్ర

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:51 PM

సింగ రేణి కార్మికుల గుండెల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శాశ్వతంగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. టీబీజీకేఎస్‌ బాధ్యతలు తీసుకున్న ఈశ్వర్‌ సోమవారం తొలి సారిగా గోదావరిఖనికి వచ్చారు. బీఆర్‌ఎస్‌, టీబీ జీకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు కొప్పుల ఈశ్వర్‌కు ఘనస్వాగతం పలికారు.

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల కీలక పాత్ర

గోదావరిఖని, జూలై 21(ఆంధ్రజ్యోతి): సింగ రేణి కార్మికుల గుండెల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శాశ్వతంగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. టీబీజీకేఎస్‌ బాధ్యతలు తీసుకున్న ఈశ్వర్‌ సోమవారం తొలి సారిగా గోదావరిఖనికి వచ్చారు. బీఆర్‌ఎస్‌, టీబీ జీకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు కొప్పుల ఈశ్వర్‌కు ఘనస్వాగతం పలికారు. మున్సిపల్‌ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించారు. అనం తరం మార్కండేయ కాలనీలోని ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఈశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమైందన్నారు. సింగరేణి కార్మికులపై కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉం టుందని చెప్పారు. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలు చేస్తున్నా యని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలను చేస్తున్నదన్నారు.

బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులను, కార్యకర్త లను పోలీసులు బెదిరించి వేధింపులకు గురి చేస్తున్నారని, యూనియన్‌, పార్టీకి సంబంధిం చిన ఉద్యోగులను అక్రమ బదిలీలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇలాంటి వాటికి గులాబీ సైన్యం భయపడదన్నారు. అక్రమ బదిలీలపై త్వరలో కోల్‌బెల్ట్‌ ప్రాంత మాజీ ఎమ్మెల్యేలతో సీఎండీని కలుస్తామని ఈశ్వర్‌ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పికొట్టేందుకు, సింగరేణిని కాపాడేందుకు టీబీజీకేఎస్‌, బీఆర్‌ ఎస్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీ లను అమలు చేయకుండా సింగరేణి తొత్తులుగా మారిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు కార్మికులే బుద్ధి చెబుతారన్నారు. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావే శంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, పుట్ట మధు, నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్‌ నాయకులు మాదాసు రామమూర్తి, రమణారావు, పీటీ స్వామి, కౌశిక హరి, నూనె కొమురయ్య, సురేందర్‌రెడ్డి, పర్లపల్లి రవి, ఐలి శ్రీనివాస్‌, వడ్డేపల్లి శంకర్‌, పెంట రాజేష్‌, జేవీ రాజు, వెంకటేష్‌, అంజలి పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:51 PM