Share News

మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Oct 05 , 2025 | 10:53 PM

మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకల కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, పలు శాఖల అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

మహనీయుల స్ఫూర్తిని   ఆదర్శంగా తీసుకోవాలి

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకల కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, పలు శాఖల అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కాకా వెంకటస్వామి అనేక పదవులను అధిరోహించారని, ఆయన జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. వెంకటస్వామి అం దించిన స్ఫూర్తితో మనందరం పని చేయాలని, విధులు నిర్వహించే సమయంలో అట్టడుగు వర్గాల వారికి మన వంతు సహకారం అందేలా చూడాలని కలెక్టర్‌ సూచించారు. ఎంతో మంది పేదలకు ఆప్పన్నహస్తం అందించిన మహనీయుడని కొనియాడారు. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో తనదైన ముద్ర వేసిన వెంక టస్వామి తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పరితపించారని, కోల్‌ బెల్ట్‌ ఏరియాలోని కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయా రన్నారు. జిల్లా అధికారులు ఎస్సీ డెవలప్‌మెంట్‌ అధికారి రవీందర్‌, జిల్లా క్రీడల అధికారి సురేష్‌, ఆర్డీఓలు గంగయ్య, సురేష్‌, కలెక్టరేట్‌ పాలన అధికారి శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌లు ప్రకాష్‌, ప్రసాద్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 10:53 PM