Share News

పని గంటల పెంపును జీవోను రద్దుచేయాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:21 AM

పనిగంటలు పెంచుతూ విడుదల చేసిన జీవో 282ను రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జీవో ప్రతులను దహనం చేశారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్‌ మాట్లాడుతూ శ్రమశక్తిని దోచి కార్పొరేట్లకు అధిక లాభాలు కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో మోదీ సర్కార్‌ నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకువస్తోందన్నారు.

పని గంటల పెంపును జీవోను రద్దుచేయాలి

పెద్దపల్లిటౌన్‌/జ్యోతినగర్‌, జూలై 6 (ఆంఽధజ్యోతి): పనిగంటలు పెంచుతూ విడుదల చేసిన జీవో 282ను రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జీవో ప్రతులను దహనం చేశారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్‌ మాట్లాడుతూ శ్రమశక్తిని దోచి కార్పొరేట్లకు అధిక లాభాలు కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో మోదీ సర్కార్‌ నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకువస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈనెల 9న సార్వత్రిక సమ్మెలోకి వెళ్తుందన్నారు. ఈ క్రమంలో గుజరాత్‌లో కార్మికులు పది గంటలు పనిచేయాలని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటల పనిని చట్టబద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

జీవో నెంబర్‌ 282ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఎన్టీపీసీ మేడిపల్లి సెంటరులో ధర్నా చేశారు. నాయకులు జంగపల్లి నరేష్‌, ముస్తఫా, బొంకూరి సాగర్‌, పల్లె రవి, కుమ్మరి నవీన్‌, మధు, ఎన్‌.భిక్షపతి, ఎం.రామాచారి, గీట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 12:21 AM