హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:24 AM
హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టర్ పెద్ద కల్వ లలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు, సిబ్బంది వివరాలను తెలుసుకొని రిజిస్టర్‌లను పరిశీలిం చారు.
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టర్ పెద్ద కల్వ లలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు, సిబ్బంది వివరాలను తెలుసుకొని రిజిస్టర్‌లను పరిశీలిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహం పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. పిల్లలకు అందిం చే ఆహార పదార్దాల నాణ్యతను రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలని అన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
కాల్వశ్రీరాంపూర్, (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కూనా రం, ఇదులాపూర్ గ్రామాల్లో మిస్సింగ్ సర్వే నెంబర్ పట్టా కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవె న్యూ అధికారులకు సూచించారు. అనంతరం జాఫర్ ఖాన్‌పేట, ఇదులాపూర్ గ్రామాల్లోని అప్పర్ ప్రైమరీ స్కూల్, అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవా లని, ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు ఉండేలా చూడాలన్నారు. పిల్లలకు చదవడంతోపాటు అర్థం చేసు కునేలా గ్రహణశక్తి పెంపొందించాలన్నారు. అంగన్‌వాడీ సెంటర్‌లను పరిశీలించి పిల్లలు ఎంత మంది వస్తు న్నారు, ఎలాంటి ఆహారం అందిస్తున్నారని టీచర్‌ను అడిగి తెలుసుకొని హాజరు రిజిష్టర్‌లను పరిశీలించారు. తహసీల్దార్ జగదీశ్వర్ రావు, డిప్యూటీ తహసీల్దార్ గర్రెపల్లి శంకర్, సర్వేయర్ రాజు పాల్గొన్నారు.