Share News

ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:49 PM

పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను విని వాటిని చట్ట పరంగా పరిష్కరించాలని పోలీస్‌ అధికారులకు రామగుండం సీపీ శ్రీనివాస్‌ సూచించారు. సోమవారం కమిషనరేట్‌కు వచ్చిన ఫిర్యాదుదారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులను స్వీక రించి బాధితుల సమస్యలను విన్నారు.

ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలి

కోల్‌సిటీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను విని వాటిని చట్ట పరంగా పరిష్కరించాలని పోలీస్‌ అధికారులకు రామగుండం సీపీ శ్రీనివాస్‌ సూచించారు. సోమవారం కమిషనరేట్‌కు వచ్చిన ఫిర్యాదుదారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులను స్వీక రించి బాధితుల సమస్యలను విన్నారు. బాధితుల సమస్యలపై ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు, అధికారులతోఫోన్‌లలో మాట్లాడి కేసు పురోగతి, సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

ప్రజలు నిర్భయంగా, పైరవీ కారుల ప్రమేయం లేకుండా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సమస్యలు ఉంటే ఫిర్యాదు చేసి పోలీస్‌సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా రామగుండం కమిషనరేట్‌ పోలీసులు పని చేస్తున్నారని ఆయన చెప్పారు.

Updated Date - Feb 17 , 2025 | 11:49 PM