వైభవంగా మహాసుదర్శన యాగం
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:45 PM
వేదమంత్రోచ్ఛారణలతో గోదావరిఖనిలోని సత్యసాయి మందిరం ప్రాంగణం పరవశించిపోయింది. పీఠాధిపతుల మార్గదర్శనంలో రాష్ర్టీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు తూడి శ్రావణ్‌కుమార్‌స్వామి ఆధ్వర్యంలో మహాసుదర్శన, రాజశ్యామల దేవి త్రయాహ్నిక యజ్ఞ మహోత్సవాలు కొనసాగుతున్నాయి.
కోల్‌సిటీటౌన్, జూలై 22(ఆంధ్రజ్యోతి): వేదమంత్రోచ్ఛారణలతో గోదావరిఖనిలోని సత్యసాయి మందిరం ప్రాంగణం పరవశించిపోయింది. పీఠాధిపతుల మార్గదర్శనంలో రాష్ర్టీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు తూడి శ్రావణ్‌కుమార్‌స్వామి ఆధ్వర్యంలో మహాసుదర్శన, రాజశ్యామల దేవి త్రయాహ్నిక యజ్ఞ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మహాసుదర్శన యాగం వేదమంత్రోచ్ఛారణల మధ్య కొనసాగింది. ఈ యాగానికి కేదార్‌నాథ్ క్షేత్ర పీఠాధిపతి శివరుద్ర స్వామిజీ, రాజరాజేశ్వర పీఠాధిపతి అంబికేశ్వరస్వామి, కరుణనందగిరి స్వామి, అభినవ కల్యాణనంద భారతిస్వామి, రాఘవేంద్రస్వామి, త్రిశక్తి షణ్ముఖస్వామి, మాత మహేశ్వరి దేవి, శివప్రియానంద స్వామిజీలు హాజరయ్యారు. మంత్రపుష్పం, ఆశీర్వచనం, నివేదన చేశారు. మహిళలచే ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. త్రిశక్తి మాత స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు కోమళ్ళ మహేష్, అరవింద్‌స్వామి, మచ్చ విశ్వాస్, కుమారస్వామి, రవి, భవాని, అమ్మరాజు, మీసాల కృష్ణ, ఎం.శంకరయ్య, మల్లేశ్వర్‌రావుతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేడు రాజశ్యామల యాగం
బుధవారం రాజశ్యామల దేవి యాగం, ప్రత్యంగిరి, వారాహిదేవి హోమాలతోపాటు పూర్ణహుతి, మంత్రపుష్పం, మహాదాశీర్వచనం, తీర్ధప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయని తూడి శ్రావణ్‌కుమార్‌స్వామి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.