ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:58 PM
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్రా లకు వస్తున్న నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేస్తూ వెంట వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ వ్యవ సాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్రా లకు వస్తున్న నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేస్తూ వెంట వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ వ్యవ సాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యార్డు ఆవరణలో కుప్పలుగా పోసి ఉన్న ధాన్యం నిల్వలను కలెక్టర్ పరిశీలించి అధికారులచే మాయిశ్చర్ పరీక్షలు చేయించారు. అనంతరం కలెక్టర్ అధికారులు, మిల్లర్లు, రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడుతు ధాన్యం కొనుగోళ్లను వేగ వంతం చేయాలని, 24 గంటల పాటు కొనుగోళ్ల ప్రక్రి య జరగాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, కేంద్రాల వద్ద అవసరమైన పాలిథిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవా లన్నారు. నిబంధనల మేరకు తేమ శాతం, తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలన్నారు. హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని, వెంట వెంటనే మిల్లులకు ధాన్యం తరలించేందుకు లారీలను అందు బాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆయా కొను గోలు కేంద్రాలకు అలాట్ చేసిన మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలన్నారు. కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే దాన్యం నాణ్యతగా ఉం డేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదే శించారు. ఏ గ్రేడ్ రకం ధాన్యా నికి క్వింటాల్ 2300 రూపా యలు చెల్లిస్తామన్నారు. సీరి యల్ నంబర్ ప్రకారంగా కొను గోలు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వేణు, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరా సంస్థ అధికారి రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, విజయపాల్ రెడ్డి, తహసీల్దార్ రాంచంద్రారావు, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, సీఈఓ సంతోష్ పాల్గొన్నారు.