మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:44 PM
మహిళలను ఆర్థి కంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని బందంపల్లి స్వరూప గార్డెన్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
పెద్దపల్లిటౌన్, నవంబరు 24 (ఆంఽధ్రజ్యోతి): మహిళలను ఆర్థి కంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని బందంపల్లి స్వరూప గార్డెన్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహిళలం దరూ మా ఆడబిడ్డలేనని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తు న్నట్లు గుర్తు చేశారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పేరిట మహిళ లకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నాసిరకపు చీరలను మహిళలకు అందజేసి అవ మానపర్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గౌరవం కాపా డే విధంగా నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఆడబి డ్డలకు చీర సారే ఇచ్చి గౌరవించడం సంప్రదాయమన్నారు. మహి ళా శక్తి ద్వారా వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీ బస్సు లు, సోలార్ ప్లాంట్లు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇందిరా మహిళా శక్తి చీరలు కలెక్టర్ నేతృత్వంలో మహిళా సమాఖ్యల ద్వారా ప్రతీ మహిళకు చేరుతాయన్నారు. ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ప్రజలు, మహిళలు ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అందించిన చీరెలు పొలాలు, తోటలు, చేళ్ళకు అడ్డుగా కట్టుకునేందుకు వాడుకున్నారన్నారు. జిల్లా ప్రధానాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం వల్ల ఓపీ సంఖ్య పెరుగడంతో పాటు వివిధ రకాలు సర్జరీలు, ప్రస వాలు జరుగుతున్నాయని వివరించారు. ఎమ్మారై, సీటీ స్కాన్ ఏర్పాటుకు మంత్రిని కోరగా నివేధిక పంపించాలని కలెక్టర్‌కు సూచించారు. రామగుండం నియోజకవర్గంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎకరం స్థలం కేటాయించినట్లు తెలిపారు. జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పొలాల్లో బెదురు పెట్టేందుకే నాటి బతుకమ్మ చీరలు
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): గతంలో బీఆర్‌ఎస్ పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు పంట పొలాల్లో బెదురు పెట్టడానికే పనికొచ్చా యని, నేటి ఇందిరమ్మ చీరలు నీలి రంగుల్లో ఆకాశమే హద్దుగా అక్కాచెల్లెల్లు ఆనందిస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో మాట్లాడారు. మహిళా పక్షపాతిగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాయని తెలిపారు. మండల వ్యాప్తం గా ఇప్పటి వరకు 12 వేల పై చిలుకు చీరలు పంపిణీ చేశామని, మహిళా గ్రూపుల్లో లేని వారికి కూడా చీరలు అందిస్తామని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు చీర సారె పెట్టడం తెలంగాణ సాంప్ర దాయమని, అందుకే రాష్ట్రంలోని ప్రతీ మహిళకు చీరను అందిం చడం రేవంతన్న లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.