Share News

మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలి

ABN , Publish Date - May 17 , 2025 | 11:59 PM

ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపాలని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ప్రజా సంఘాల నాయకులు కోరారు. ప్రెస్‌క్లబ్‌లో శనివా రం తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ జిల్లా 2 వ మహాసభలు జరిగాయి. జిల్లా కన్వీనర్‌ గుమ్మడి కొమురయ్య అధ్యక్షతన, సమన్వయకర్తగా గాండ్ల మల్లేశం వ్యవహరించారు.

మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలి

పెద్దపల్లిటౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి) ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపాలని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ప్రజా సంఘాల నాయకులు కోరారు. ప్రెస్‌క్లబ్‌లో శనివా రం తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ జిల్లా 2 వ మహాసభలు జరిగాయి. జిల్లా కన్వీనర్‌ గుమ్మడి కొమురయ్య అధ్యక్షతన, సమన్వయకర్తగా గాండ్ల మల్లేశం వ్యవహరించారు. ప్రజా ఫ్రంట్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ మంథని సంజీవ రావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌రాష్ట్ర కో కన్వీనర్‌ బి. రమాదేవి మాట్లాడుతూ సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ల విధ్వంసం, ఇటుక బట్టీలలో ఒడిశా కార్మికుల శ్రమ దోపిడీ, దళితులపై, మైనారిటీ వర్గాలపై దాడులు, రాజ్య హింసకు వ్యతిరేకంగా జిల్లా కమిటీ పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ ను ఎత్తివేయాలని, మావోయిస్టు పార్టీతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనా రంలో అన్యాక్రాంతమైన భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని తీర్మానించారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుమ్మడి కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా పులిపాక రవీందర్‌, ఉపాధ్య క్షుడిగా గాండ్ల మల్లేశం, సభ్యులుగా రాజు, అంజన్న, సుధాకర్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మల్లన్న, బొంకూరి లక్ష్మణ్‌, బొడ్డుపల్లి రవి, బాలసాని రాజయ్య, మార్వాడి సుదర్శన్‌, ఎరుకల రాజన్న, జైపాల్‌ సింగ్‌, పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:59 PM