Share News

రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:51 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతర్గాం, పాలకుర్తి మండ లాల్లోనే రైతాంగానికి రెండు పంటలకు నీరందించేలా ఎల్లంపల్లి వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించానన్నారు.

రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం

అంతర్గాం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతర్గాం, పాలకుర్తి మండ లాల్లోనే రైతాంగానికి రెండు పంటలకు నీరందించేలా ఎల్లంపల్లి వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించానన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం రామగుండం నియోజకవర్గ రైతులు సాగునీటికి అనేక ఇబ్బం దులు పడ్డారని, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సాగు, తాగునీటికి కొరత లేదన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వివిధ అభివృద్ధి పను లకు నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

గుండెపోటుతో మృతి చెందిన ఎక్లాస్‌పూర్‌లోని తూడూరి శ్రీనివాస్‌ గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. నాయకులు పెండ్యాల మహేష్‌, పూదరి సత్తయ్య గౌడ్‌, లగిశెట్టి రాకేష్‌, గాదె సుధాకర్‌, పెండ్రు హనుమాన్‌ రెడ్డి, ముక్కెర శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:51 PM