Share News

భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:46 PM

భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసే నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలని, సంక్షేమ బోర్డును ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పజెప్పడాన్ని నిలిపి వేయాలని, సంక్షేమ పథకాలను నేరుగా ప్రభుత్వమే కార్మిక వర్గానికి అందజేయాలని ఐఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 10 (ఆంఽధ్రజ్యోతి) భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసే నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలని, సంక్షేమ బోర్డును ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పజెప్పడాన్ని నిలిపి వేయాలని, సంక్షేమ పథకాలను నేరుగా ప్రభుత్వమే కార్మిక వర్గానికి అందజేయాలని ఐఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ, జిల్లా అధ్యక్షుడు నరేష్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్కీములను కార్మికులకు అందజేయాలని, సాధారణ మరణానికి, మ్యారేజ్‌ గిఫ్ట్‌, మెటర్నటీ, హాస్పిటలైజేషన్‌కు, శాశ్వత అంగవైకల్యానికి నిధులు పెంచాలన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వీరికి అడ్డాల వద్ద, పని స్థలాల్లో భద్రత, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని తక్షణమే కార్మిక వర్గానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

60 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి పింఛన్‌ సౌకర్యం కల్పించాలని, కార్మికుల పిల్లలకు ఉపకారవేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. నాయకులు ఎం దుర్గయ్య, ఐ రాజేశం, ఎం కొమరయ్య, బి రాజనర్సు, కే మల్లేశం, తిర్రి బాలకృష్ణ, నారాయణ. తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 11:46 PM