Share News

రైతులకు సాగు నీరందించడమే లక్ష్యం

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:23 PM

రైతులకు సాగునీరు అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం ఓదెల మండలం మడకలో 42ఆర్‌ కెనాల్‌ నుంచి పొత్కపల్లి పరిసర ప్రాంతాలకు సాగు నీరందించడానికి, పొత్కపల్లి ఊర చెరువులోకి నీరు వెళ్ళడానికి కాల్వ తవ్వకం పనులను ప్రారంభించారు.

రైతులకు సాగు నీరందించడమే లక్ష్యం

ఓదెల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రైతులకు సాగునీరు అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం ఓదెల మండలం మడకలో 42ఆర్‌ కెనాల్‌ నుంచి పొత్కపల్లి పరిసర ప్రాంతాలకు సాగు నీరందించడానికి, పొత్కపల్లి ఊర చెరువులోకి నీరు వెళ్ళడానికి కాల్వ తవ్వకం పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, గత ప్రభుత్వం రైతన్నలకు సాగు నీరందించకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు.

రైతులు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళితే తరుగు పేరిట ధాన్యంలో కోత విధించి రైతులను నట్టేట ముంచారని తెలిపారు. కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ధాన్యం కటింగ్‌ లేకుండా రైతులకు అండగా నిలిచామన్నారు. అనంతరం ఓదెలలో ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించారు. సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ళ సుమన్‌ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ చీకట్ల మొండయ్య, మాజీ ఎంపిటిసి స్వామి, మాజీ సర్పంచ్‌ ఆకుల మహేందర్‌, పిట్టల నర్సింగం, రెడ్డి రజినీకాంత్‌, మేకల అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:23 PM