Share News

రామగుండాన్ని సుందరంగా తీర్చిదిద్దమే లక్ష్యం

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:41 PM

రామగుండాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖని తిలక్‌నగర్‌లో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన ప్రజాపార్కును ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.

రామగుండాన్ని సుందరంగా తీర్చిదిద్దమే లక్ష్యం

గోదావరిఖని, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రామగుండాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖని తిలక్‌నగర్‌లో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన ప్రజాపార్కును ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి నిధులు రూ.5కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం, రిటైర్డ్‌ కార్మికులు, మహిళల కోసం రూ.20లక్షలతో త్వరలోనే జిమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు, తిలక్‌నగర్‌లో మూడు నెలల్లో పార్కు నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలవుతాయని చెప్పారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమార్‌ మాట్లా డుతూ రామగుండం ఏరియాలో కార్మికుల సంక్షేమానికి సింగరేణి సంస్థ కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తుందని, కార్మికవాడలను అభివృద్ధి చేయడానికి సీఎస్‌ఆర్‌ నిధులను వినియోగిస్తున్నట్టు చెప్పారు. బొంతల రాజేష్‌, కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాష్‌, కొలసాని శ్రీనివాస్‌, సింగరేణి అధికారులు గోపాల్‌సింగ్‌, కిరణ్‌బాబు, కరుణ, హనుమంతరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:41 PM