Share News

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:25 AM

కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఐఎన్‌టీయూసీ నిరంతరం పోరాటం చేస్తుందని వైస్‌ప్రెసిడెంట్‌ నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

రామగిరి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఐఎన్‌టీయూసీ నిరంతరం పోరాటం చేస్తుందని వైస్‌ప్రెసిడెంట్‌ నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో జనరల్‌ సెక్రెటరీ జనక్‌ప్రసాద్‌ నాయక త్వంలో ఐఎన్‌టీయూసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం, సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. వార సత్వ ఉద్యోగాల విషయంలో అభ్యర్థుల వయోపరిమితిని 35నుంచి 40సంవ త్సరాలకు పెంచామని తెలిపారు. అలాగే నైని బ్లాక్‌ పనుల ప్రారంభానికి సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించి పనులు ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే కార్మికుల ఆకాంక్ష నెరవేరుస్తామని హామీ నిచ్చారు. గుర్తింపు సంఘం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి యాజమాన్యం, ప్రభు త్వంతో ఎలాంటి సంప్రదింపు చేపట్టకుండా కాలక్షేపం చేస్తోందని ఆరోపిం చారు. సమావేశంలో ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు కొటరవీందర్‌రెడ్డి, టైషన్‌ శ్రీనివాస్‌, గడ్డం తిరుపతి, ఎల్లాంకి రామారావు, శ్రీనివాసరావు, సత్రం సమ్మయ్య, సందేలా కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, ప్రవీణ్‌రెడ్డి, రాజయ్య, మేకల మారుతీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 12:25 AM