Share News

గిరిజన తండాల అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:47 PM

గిరిజన, లంబాడి తండాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం మల్లాపూర్‌ నుంచి మ్యాకవెంకయ్యపల్లి వరకు 11.2 కోట్ల రూపాయలతో నిర్మించే బైపాస్‌ రోడ్డును పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.

గిరిజన తండాల అభివృద్ధే లక్ష్యం

ధర్మారం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గిరిజన, లంబాడి తండాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం మల్లాపూర్‌ నుంచి మ్యాకవెంకయ్యపల్లి వరకు 11.2 కోట్ల రూపాయలతో నిర్మించే బైపాస్‌ రోడ్డును పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ముఖ్యమంత్రి సహకారంతో గిరిజన తండాల్లో రోడ్ల నిర్మాణానికి 740 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు.

గిరిజన, లంబాడీ తండాల్లో గిరిజన భవన్‌ నిర్మాణాలతోపాటు రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి 35 కోట్ల నిధులు మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. గతంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ నుంచి మంజూరైన 12 కోట్ల రూపాయలతో కీచులాటపల్లి, బుద్దేశ్‌పల్లె, దుబ్బాల గూడెం రోడ్డు పనులతో పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మెన్‌ లావుడ్య రూప్లానాయక్‌, ఽధర్మపురి నియోజక వర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు అజయ్‌, మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు సోగాల తిరుపతి, కాంగ్రెస్‌ నాయకులు చింతల ప్రతీప్‌రెడ్డి, కొత్త నర్సింహులు, రామడుగు గంగారెడ్డి, గంధం మహిపాల్‌, స్వామి పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:47 PM