ఓదెల ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:48 PM
ఓదెల మం డల కేంద్రం ప్రజల మంచినీటి సమస్య పరి ష్కరించానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. మండల కేంద్రంలో సోమ వారం మడక మానేరు నుంచి ఓదెల ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని ప్రారంభించారు. తాగు నీటి బావిలో పూజ చేసి పుష్పాలను సమర్పిం చి ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు.
ఓదెల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఓదెల మం డల కేంద్రం ప్రజల మంచినీటి సమస్య పరి ష్కరించానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. మండల కేంద్రంలో సోమ వారం మడక మానేరు నుంచి ఓదెల ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని ప్రారంభించారు. తాగు నీటి బావిలో పూజ చేసి పుష్పాలను సమర్పిం చి ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడున్నర ఏళ్ల క్రితం ఇక్కడ శిథిలమైన నీటి ట్యాంకును కూల్చివేయగా అప్పటి పాలకులు పట్టించుకోలేదన్నారు. దీంతో రూ.90 లక్షలు వెచ్చించి రెండు నీటి ట్యాంకు లను నిర్మించి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఓదెలలో కోర్టు భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇక్కడ నిర్మించిన 142 డబుల్ బెడ్‌రూమ్ భవనాలకు రూ.80 లక్షల నిధులు మంజూరు చేయించి, మౌలిక సౌకర్యాలు కల్పిస్తానని, నిజమైన పేదలకే ఈ భవనాలను కేటాయిస్తా మన్నారు. స్థానిక ఎన్నికల అనంతరం రూ.50లక్షలతో గిడ్డంగులను నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలి పారు.
హెల్త్ సెంటర్‌ను, మహిళా సమైక్య భవ నాన్ని నిర్మిస్తానని తెలిపారు. రేషన్ కార్డులు లేని అర్హులను గుర్తించి ఇప్పించాలని నాయకు లకు సూచించారు. బతుకమ్మ పండుగకు నాణ్యమైన చీరలు అందజేస్తామన్నారు. అం తకు ముందు మల్లన్న ఆలయంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. ఒగ్గు పూజారులకు విశ్రాంతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు. పెద్ద భీమరపల్లి, జీలకుంట, మడక, నాంసానిపల్లి, లంబాడ తండ, అబ్బిడి పల్లి గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి దారులకు మంజూరు పత్రాలను అందజేశారు. మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఆళ్ళ సుమన్ రెడ్డి, గోపు నారాయణరెడ్డి, చీకట్ల ముండయ్య, ఆకుల మహేందర్, గుండేటి ఐలయ్య, బైరి రవి గౌడ్, సత్యనారాయణరెడ్డి, రాహుల్ పాల్గొన్నారు.