Share News

రామగుండం ప్రజల కల నెరవేరబోతోంది

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:39 PM

రామగుండం ప్రజల కల త్వరలోనే నెరవేరబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సింగరేణి ఆధ్వ ర్యంలో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన దసరా, దీపావళి-2025 ఉత్సవాలను ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూ ర్‌తో కలిసి ప్రారంభించారు.

రామగుండం ప్రజల కల నెరవేరబోతోంది

కళ్యాణ్‌నగర్‌/మార్కండేయకాలనీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రామగుండం ప్రజల కల త్వరలోనే నెరవేరబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సింగరేణి ఆధ్వ ర్యంలో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన దసరా, దీపావళి-2025 ఉత్సవాలను ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూ ర్‌తో కలిసి ప్రారంభించారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రామగుండంలో నైజాం నాటి కలంలో నిర్మిం చిన విద్యుత్‌ ప్లాంట్‌ స్థానంలో 800మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం చేయాలంటూ మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట పట్టువదలని విక్రమార్కుడిగా తిరుగుతున్నాడని, ప్రజల కల నెరవేరబోతుందని తెలిపారు. సింగరేణి కార్మికుల శ్రమ మరువలేనిదని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుంద న్నారు. రామగుండం ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం సింగరేణి భూమిని కూడా ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. రామగుండంలో జరుగు తున్న రోడ్ల వెడల్పులో కొంత మంది వ్యాపారులు నష్టపోయినప్పటికీ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వ్యాపారులు సామాజిక కృషితో రామగుండం అభివృద్ధికి సహకరించాలన్నారు. సింగరేణి కార్మికుల పిల్లల ఉజ్వల భవిష్యత్‌ కోసం స్కిల్‌ సెంటర్‌ డెవలప్‌మెంట్‌తోపాటు ఐటీఐలో నూతనంగా రూ.50కోట్లతో ఏటీసీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

యువత ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగస్వామ్యం కావాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ లాభాలబాటలో దూసుకుపోవడానికి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నార న్నారు. రామగుండంలో త్వరలోనే ఆడిటోరియం నిర్మి స్తామన్నారు. పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం ఇస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ సింగ రేణి కార్మికుని బిడ్డనైన తాను ఈ మైదానంలో మాట్లాడుతానని ఏనాడు అనుకోలేదని, తనకు ఏ కష్టం వచ్చినా ముందుకు నడిపించే వ్యక్తి శ్రీధర్‌బాబు అని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు సహకారంతో మంత్రికి ఎదిగాన న్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గడీల పాలనను కూలగొట్టి ప్రజా పాలనను కొనసాగి స్తున్నారని, శ్రీధర్‌బాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ జిల్లాను అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారన్నారు. రామ గుండాన్ని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఆకట్టుకున్న వేడుకలు

గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన దసరా, దీపావళి ఉత్సవాలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. దీంతో జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం కిక్కిరిసిపోయింది. సినీ హాస్య నటుడు అలీ, గాయని గీతా మాధురి, మిమిక్రి ఆర్టిస్ట్‌ శివారెడ్డి, తాగుబోతు రమేష్‌, మొగిలి రేకుల సాగర్‌, జబర్దస్‌ ఫేమ్‌ రచ్చ రవి, బుల్లెట్‌ భాస్కర్‌, వర్ష, ఫాహిమ, చెన్నైకి చెందిన కళాకారులు ఫైర్‌ డ్యాన్స్‌ చేసి అందరిని ఆకట్టుకున్నారు. గాయని గాయకులు పాటలతో ఉత్తేజపరిచారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాతీయ ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్‌, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అడిషనల్‌ కలెక్టర్‌, కమిషనర్‌ అరుణశ్రీ, మినిమమ్‌ వేజ్‌బోర్డు చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకుడు కే స్వామి, కాం గ్రెస్‌ నాయకులు రాజేష్‌, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, పెద్దెల్లి ప్రకాష్‌, రాజిరెడ్డి, బొమ్మక రాజేష్‌, గుండేటి రాజేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 11:39 PM