క్రిటికల్ కేర్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:21 AM
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 15రోజుల్లో క్రిటికల్ కేర్ భవనాన్ని పూర్తిచేసి అప్పగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఏఈ విక్రమ్ ఆదిత్యకు సూచించారు. గురువారం కలెక్టర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రిటికల్ కేర్ భవనాన్ని పరిశీలించారు.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 15రోజుల్లో క్రిటికల్ కేర్ భవనాన్ని పూర్తిచేసి అప్పగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఏఈ విక్రమ్ ఆదిత్యకు సూచించారు. గురువారం కలెక్టర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రిటికల్ కేర్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని, భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
సదరం క్యాంపు నిర్వహణ పనులను వారం రోజుల్లో పూర్తి చేసి దివ్యాంగులకు క్యాంపులను నిర్వహించాలని సూచించారు. క్యాంపునకు వచ్చే వారికి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం గాంధీనగర్‌లోని గాంధీ పార్కు ఉర్దూ మీడియం బాలికల పాఠశాలను సందర్శించారు. బాలికల పాఠశాలకు మంజూరు చేసిన నిధులను వినియోగించుకుని రెండు నెలల్లో భవన నిర్మాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఉర్దూ మీడియం పాఠశాల వద్ద ఉన్న పాత భవనాన్ని తొలగించాలని సూచించారు. ఆయన వెంట ఆర్‌ఎంఓ దండె రాజు, ఏఈ విక్రమ్ ఉన్నారు.