Share News

క్రిటికల్‌ కేర్‌ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:23 PM

గోదా వరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌ విభాగాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆయన శుక్రవారం ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్‌, జనరల్‌ సర్జన్‌, గైనిక్‌ పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డు, ఓపీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

క్రిటికల్‌ కేర్‌ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి

కళ్యాణ్‌నగర్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): గోదా వరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌ విభాగాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆయన శుక్రవారం ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్‌, జనరల్‌ సర్జన్‌, గైనిక్‌ పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డు, ఓపీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి ఆవరణలో రూ.16 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ భవ నాన్ని ఆగస్టు 15 లోపు పూర్తి చేసి అప్పగించాలని కలె క్టర్‌ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఆసు పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలు గకుండా అవసరమైన సిబ్బందిని నియమిం చాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిం చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దయాల్‌ సింగ్‌, ఆర్‌ఎంఓ రాజు, తహసీల్దార్‌ ఈశ్వర్‌ ఉన్నారు.

ఇద్దరు పారిశుధ్య సిబ్బంది విధుల నుంచి తొలగింపు

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగుల వద్ద డబ్బులు డిమాండ్‌ చేసిన ఇద్దరు అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ కోయశ్రీహర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ తనిఖీ సమ యంలో కార్మికులు బీ హన్మంతు, లావణ్య రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని రోగులు ఫిర్యాదు చేయడంతో వారిద్దరిని టర్మి నేట్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. రోగులకు బెడ్‌షీట్లు మార్చే సమయంలో డబ్బు లు ఇస్తేనే బెడ్‌షీట్లు మారుస్తామని లంచం డిమాండ్‌ చేయడంతో వీరిద్దరిని తొలగించారు. ఆయన మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బం దులకు గురి చేయడం సరైంది కాదన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు.

Updated Date - Jul 25 , 2025 | 11:23 PM