Share News

సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:18 AM

రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ లబ్ధిదారునికి సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం పాలితం, కాసులపల్లి, గోపయ్యపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు.

సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది

పెద్దపల్లి రూరల్‌ , జూలై 19 (ఆంధ్రజ్యోతి) : రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ లబ్ధిదారునికి సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం పాలితం, కాసులపల్లి, గోపయ్యపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్లకు ముగ్గులు పోసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట దోపిడి చేశారే తప్ప అభివృద్ధి జరిగిన దాఖలాలు లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమ చేసిందని గుర్తు చేశారు.

నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని హమీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు. గతంలో ఇసుక, మట్టి అమ్ముకున్న పాలకులు ఉన్నారని ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం చౌకగా ఇసుకను అందిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కూర మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటరెడ్డి, ఇనుగాల రాజిరెడ్డి, సాయిచంద్‌రావు, ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్‌, ఎంపీవో ఫయాజ్‌, కార్యదర్శులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 12:18 AM