ప్రజా సమస్యలపై పోరాడేది సీపీఐ పార్టీ
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:50 PM
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది సీపీఐ పార్టీ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పేరొన్నారు. సోమవారం ఎన్‌ఎస్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 17న జరిగే నాలుగో జిల్లా మహాస భలను జయప్రదం చేయాలని పార్టీ కార్యకర్తలకు, నాయకు లకు, కార్మికులకు, కర్షకులకు పిలుపునిచ్చారు.
పెద్దపల్లి టౌన్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది సీపీఐ పార్టీ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పేరొన్నారు. సోమవారం ఎన్‌ఎస్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 17న జరిగే నాలుగో జిల్లా మహాస భలను జయప్రదం చేయాలని పార్టీ కార్యకర్తలకు, నాయకు లకు, కార్మికులకు, కర్షకులకు పిలుపునిచ్చారు. సభకు ముఖ్య అతిథులుగా కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యు లు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారామ య్యలు హాజరవుతారన్నారు.
ఈ మహాసభను పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదల కోసం, భూమి లేని పేద ప్రజల కోసం లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని, సీపీఐ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజలకోసం నిరంతరం పోరాడే పార్టీ అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, కె.కనకరాజు, మండల కార్యదర్శి పూసాల రమేష్, పట్టణ కార్యదర్శి కళ్లెపెల్లి నవీన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మార్కాపూరి సూర్య, పెరక రాయమల్లు, బొంకురి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.