పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:18 AM
రామగుండం పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అసంపూర్తిగా వదిలేసిన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
గోదావరిఖని, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రామగుండం పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అసంపూర్తిగా వదిలేసిన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. శనివారం పార్కింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో సీఎం గ్రాంట్ కింద రామగుండానికి రూ.2కోట్ల నిధులతో ప్రతి డివిజన్‌లో డ్రైనేజీలు, రోడ్లు, నల్లా కనెక్షన్లు పూర్తి చేశామన్నారు. లక్ష్మీనగర్‌లో రద్దీ పెరగడంతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సోమారపు సత్యనారాయణ పాత మున్సిపల్ కార్యాలయంలో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారని, దానికి రూ.3కోట్ల నిధులు కేటాయించారని, పిల్లర్ల దశ వరకు నిర్మాణం చేపట్టి నిలిపివేశారని, ప్రస్తుత ఎమ్మెల్యే ఆ నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు మూల విజయారెడ్డి, గోపు ఐలయ్యయాదవ్, కల్వచర్ల కృష్ణవేణి, గుంపుల లక్ష్మి, రమ్యయాదవ్, సుజాత, మారుతి, వాసు, పిల్లి రమేష్, ఇరుగురాళ్ల శ్రావణ్, కోడి రామకృష్ణ పాల్గొన్నారు.