Share News

రామగుండంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమి లేదు

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:50 PM

రామ గుండం నియోజకవర్గంలో రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ చేసింది శూన్యమని, ప్రజ లకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చడంలో విఫల మయ్యారని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ ఎస్‌ చార్జిషీట్‌ను విడుదల చేశారు.

రామగుండంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమి లేదు

గోదావరిఖని, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రామ గుండం నియోజకవర్గంలో రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ చేసింది శూన్యమని, ప్రజ లకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చడంలో విఫల మయ్యారని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ ఎస్‌ చార్జిషీట్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లా డుతూ రామగుండంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినా వాటిని నెరవేర్చలేదని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని, రామగుండంలో కూల్చివేతలు తప్ప ఏమి లేవని, కొంత మంది చోటా మోటా నాయకులతో పరుష పదజాలంతో దూషించడం సరైంది కాదన్నారు. భవిష్య త్‌లో స్థానిక ఎమ్మెల్యే ఊరును ఏం చేస్తాడోనని ప్రజలు భయ పడుతున్నా రని, గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో కొబ్బరికాయ కొట్టిన పనులనే ఇప్పుడు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయ కుండా పెండింగ్‌లో పెడుతున్నారని, లక్ష్మీనగర్‌లో ఉన్న రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించి షాపుల ముందు వేయడం వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయ కులు మూల విజయారెడ్డి, కవిత సరోజిని, నూతి తిరుపతి, సట్టు శ్రీనివాస్‌, బుర్రి వెంకటి పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 11:50 PM