ముప్పై యేండ్ల కల సాకారం చేసిన ముఖ్యమంత్రి
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:53 PM
ఎస్‌సి వర్గీకరణ అనేది ముప్పై యేండ్ల కల అని, ఆ కలను సాకరం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణతో పాటు బీసీ కుల గణన చేపట్టిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.

ధర్మారం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఎస్‌సి వర్గీకరణ అనేది ముప్పై యేండ్ల కల అని, ఆ కలను సాకరం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణతో పాటు బీసీ కుల గణన చేపట్టిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. ఆయన మాట్టాడుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఎస్‌సీ వర్గీకరణ, బీసీ కుల గణన ముఖ్యమంత్రి చేయడం గర్వించ దగ్గ విషయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల గణన, ఎస్‌సీ వర్గీకరణ చేయడం చరిత్ర పుటల్లో లిఖించ దగ్గ విషమన్నారు. వారం రోజుల్లో ధర్మపురిలో కృతజ్ఞత సభ నిర్వహిస్తామని తెలిపారు. ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కొడారి హన్మండ్లు, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, కొత్త నర్సింహులు, దేవి జనార్దన్, బొల్లి స్వామి, పాలకుర్తి రాజేశం, కాంపెల్లి రాజేశం తదితరులు పాల్గొన్నారు.